యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కీలక పదవుల కోసం యూపీఏ మిత్రపక్షాల పట్టు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 13:09 IST )
తనతో కలిసి ప్రమాణస్వీకారం చేయాల్సిన మంత్రుల జాబితాను సమర్పించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోవాల్సి ఉంది. అయితే యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కీలక పదవుల కోసం పట్టుబడుతుండటంతో.. మంత్రివర్గ జాబితా ఖారారు కాలేదు.

ఈ కారణంగా ప్రధాని మన్మోహన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోవడం రద్దు అయింది. అనధికారిక కథనాల ప్రకారం.. యూపీఏ కూటమిలోని రాజకీయ పార్టీలు కీలక మంత్రివర్గ స్థానాల కోసం పట్టుబడుతుండటంతో, కాంగ్రెస్ ఇప్పటికీ జాబితాను ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ జాబితా పూర్తిస్థాయిలో ఖారరైన తరువాతే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలని భావిస్తోంది.

కొత్త మంత్రివర్గంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక శాఖను, పి.చిదంబరం హోం శాఖను, కమల్ నాథ్ వాణిజ్య శాఖ, కపిల్ సిబాల్ మానవ వనరులు లేదా విదేశాంగ శాఖలు చేపట్టే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి సుశీల్ కుమర్ షిండే, వి.కిషోర్ చంద్ర డియో పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లోక్‌సభలో కొత్తగా అడుగుపెట్టిన మల్లికార్జున్ ఖార్గే (కర్ణాటక), మణికా టాగూర్ (తమిళనాడు)లు కూడా మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒరిస్సా సీఎంగా నవీన్ ప్రమాణస్వీకారం
రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...