యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 09:48 IST )
కేంద్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల కోసం దాని భాగస్వామ్య పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాల చర్చలు బుధవారం పదవుల చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ వరుసగా రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం 322 మంది ఎంపీల మద్దతులో ఈసారి ప్రభుత్వం కొలువుతీరబోతుంది. యూపీఏ కూటమికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ), ఆర్జేడీ, బీఎస్పీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కులుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ నూతన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్‌ను నియమించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఆయనకు అందజేశారు. దీంతో తన మంత్రిమండలి సభ్యులతో ప్రధాని మన్మోహన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసారి కేంద్రంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో కాంగ్రెస్ నేతలు సింహభాగాన్ని దక్కించుకోనున్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రివర్గ పదవులను కూడా వారి వద్దే ఉంచుకునే అవకాశముంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200లకుపైగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్
బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి
బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న ఎన్డీఏ పక్షాలు
కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...