యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 09:17 IST )
దేశ ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకున్న 274మంది ఎంపీల మద్దతుకు సంబంధించిన పత్రాలను మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు రాష్ట్రపతికి అందజేశారు.

సోనియా, మన్మోహన్‌లు చూపించిన మద్దతుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి సర్కారు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరారు. అదేసమయంలో శుక్రవారం ప్రధానిగా ప్రమాణం చేయాలంటూ మన్మోహన్‌కు రాష్ట్రపతి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మన్మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

15వ లోక్‌సభలో అతిపెద్ద పార్టీకి, అతిపెద్ద కూటమికి మన్మోహన్ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్న రాష్ట్రపతి ఆయనను ప్రధానిగా నియమించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అలాగే మంత్రిమండలిలోకి ఎవరెవరినీ తీసుకుంటారనే విషయాన్ని తనకు తెలియజేయాల్సిందిగా ఆమె మన్మోహన్‌ను కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్
బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి
బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న ఎన్డీఏ పక్షాలు
కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్
యూపీఏ కూటమికి 316 మంది ఎంపీల మద్దతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...