|
| సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 16:56 IST ) | |
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు ప్రాంతాలకు చెందిన పన్నెండో తరగతి ఫలితాలు ప్రకటించింది. అజ్మీర్, పంచ్‌కులా, చెన్నై ప్రాంతాల ఫలితాలు వెల్లడించినట్లు సీబీఎస్ఐ తెలిపింది. ఈ మూడు ప్రాంతాల విద్యార్థులు ఇంటర్నెట్‌లో తమ ఫలితాలు చూసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీసహా ఇతర ప్రాంతాల ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తారు. మార్చిలో జరిగిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సీబీఎస్ఐ పాఠశాలలు తమ విద్యార్థులందరి ఫలితాలు పొందేందుకు పాఠశాల కోడ్, ఇ- మెయిల్ ఐడీల సంబంధిత వెబ్‌సైట్‌లలో రిజిస్టర్ చేయడం ద్వారా పొందవచ్చు.
విద్యార్థులు కూడా వారి ఫలితాలను ఇ- మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేసి చూసుకోవచ్చు. ఫలితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్,ఎన్ఐసీ.ఐఎన్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీబీఎస్ఈరిజల్ట్స్.ఎన్ఐసీ.ఇన్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీబీఎస్ఈ.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చని సీబీఎస్ఐ అధికారులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|