|
| రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 16:49 IST ) | |
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ బుధవారం తిరిగి ఎన్నికయిన సోనియా గాంధీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయిన మన్మోహన్ సింగ్ యూపీఏ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కూడా నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్‌ను సోనియా, మన్మోహన్ కోరతారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఎంపీలు అందజేసిన లేఖలను ప్రతిభా పాటిల్‌కు అందజేస్తారు.
ఇదిలా ఉంటే బుధవారం ఉదయం సోనియా గాంధీ నివాసంలో యూపీఏ కూటమి పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలను దూరంగా ఉంచారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం కోసం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి నేతలు నిర్ణయించారు. అంతేకాకుండా సోనియా గాంధీని యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|