యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న ఎన్డీఏ పక్షాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 09:14 IST )
తాజా ఎన్నికల్లో పరాజయంపై ఎన్డీఏ భాగస్వాములు కూటమికి నేతృత్వం వహించిన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్డీఏలోని రాజకీయ పార్టీలు మంగళవారం 15వ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బీజేపీయే కారణమని ఎదురుదాడి చేయడం ప్రారంభించాయి.

వరుణ్ గాంధీ మైనారిటీలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం తదితర అంశాలు ఎన్నికల్లో పరాజయానికి కారణాలయ్యాయని ఆరోపించాయి. ఈ వాదనకు బీజేపీ నేత కూడా ఒకరు గొంతు కలిపారు.

బీజేపీ ఎంపీ షాహ్నవాజ్ హుస్సేన్, శిరోమణి అకాలీదళ్ నేత ఎస్ఎస్ ధిండ్సా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరుణ్ గాంధీ చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతకుముందు ఎన్డీఏ కన్వీనర్, జేడీ(యు) నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ మోడీని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం ఓటర్లలో అయోమయాన్ని సృష్టించిందన్నారు.

ఎన్నికల సందర్భంగా తమ నేతలు చేసిన ప్రకటనలు సమస్యలు సృష్టించాయని హుస్సేన్ తెలిపారు. పార్టీ నాయకత్వం ముందు ఈ విషయాన్ని లేవనెత్తుతానని వరుణ్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్
యూపీఏ కూటమికి 316 మంది ఎంపీల మద్దతు
మే 22న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...