యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 09:02 IST )
ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు మొహమ్మెద్ అజ్మల్ అమీర్ కసబ్ వద్ద దొరికిన ఐడీ కార్డు నకిలీదని రాష్ట్ర రాజధానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. కసబ్ తమ కళాశాల విద్యార్థి కాదని స్పష్టం చేశారు. గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన దాడుల్లో పాల్గొన్న పది మంది ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే భద్రతా దళాలకు ప్రాణాలతో దొరికిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ముంబయి దాడులకు సంబంధించి అనేక కేసుల్లో అజ్మల్ కసబ్ నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించి జరుగుతున్న కోర్టు విచారణకు హైదరాబాద్‌లోని అరుణోదయా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ హాజరయ్యారు. కసబ్ వద్ద ఈ కళాశాలకు చెందిన ఏడు ఐడీ కార్డులు దొరికాయి. ఇందులో ఒకటి కసబ్ ఐడీ కార్డుకాగా, మిగిలిన ఆరు అతని సహచరులకు చెందినవిగా గుర్తించారు.

ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన కోర్టు విచారణలో కసబ్ ఐడీ కార్డు నకిలీదని, అతను తమ కళాశాల విద్యార్థి కాదని అరుణోదయా ప్రిన్సిపాల్ జి.రాధాకృష్ణన్ తెలిపారు. ముంబయి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు తాము పాకిస్థానీయులమని తెలియకుండా ఉండేందుకు ఈ ఐడీ కార్డులు వాడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.

కసబ్‌ను మీ కళాశాలలో చూశారా అని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నకు రాధాకృష్ణన్ సమాధానమిస్తూ.. ఇతను తమ కళాశాల విద్యార్థి కాదని చెప్పారు. తమ కళాశాలతో చదువుతున్న 600 మంది విద్యార్థులు తనకు వ్యక్తిగతంగానూ తెలుసన్నారు. వారిలో కసబ్ లేడని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ కూటమికి 316 మంది ఎంపీల మద్దతు
మే 22న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...