యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
యూపీఏ కూటమికి 316 మంది ఎంపీల మద్దతు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 08:46 IST )
మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే యూపీఏ కూటమి ప్రభుత్వానికి 316 మంది ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన బహుజన్ సమాజ్‌వాదీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ (ఎస్పీ)లు రెండూ మంగళవారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి అనూహ్య మద్దతు ప్రకటించాయి.

ఈ రెండు పార్టీలకు 44 మంది ఎంపీల బలం ఉండటంతో, సాధారణ మెజారిటీ కంటే యూపీఏ కూటమికి చాలా ఎక్కువ మద్దతు లభించినట్లయింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 272 మంది ఎంపీల మద్దతు మాత్రమే అవసరం అవుతుంది. ఇదిలా ఉంటే మాజీ ప్రధానమంత్రి 18వ వర్ధంతి (గురువారం) తరువాతి రోజున కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు కేంద్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు బుధవారం సమావేశం కానున్నాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు (సీపీపీ) సమావేశంలో తమ నేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఛైర్‌పర్సన్ బాధ్యతలను సీపీపీ సోనియా గాంధీకి అప్పగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మే 22న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...