యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 15:54 IST )
దేశం ముందున్న సమస్యలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇస్తామని పేర్కొన్నారు. దేశం వెనుకబడి ఉండేందుకు అంగీకరించబోమని చెప్పారు. ఇప్పుడు మనం బస్సు మిస్సవరాదని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు.

ఆసియాలోని అనేక దేశాలు అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నాయని, ప్రపంచ ఆధిపత్యం క్రమంగా పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలవైపు వస్తోందని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మరోసారి గొప్ప ప్రజాస్వామ్యంగా నిలిచిందని తెలిపారు. అయితే మన ముందు ఉన్న సవాళ్లు అధైర్యపరుస్తున్నాయని చెప్పారు.

ప్రజలు ఆకాంక్షలు తీరుస్తామనే ఆశతో వారు తాజా ఎన్నికల్లో మనకు ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. మనం కొత్త శక్తితో పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నారు. మరింత బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం
కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ
ప్రధాని రాజీనామా: త్వరలో కొత్త ప్రభుత్వం
ప్రధాని అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు: మోడీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...