|
| యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 14:12 IST ) | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మంగళవారం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి బేషరతు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్నికల తరువాత తృతీయ కూటమి నుంచి బీఎస్పీ బయటకు వచ్చినట్లయింది.
తాజా ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ 21 ఎంపీ సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మాయావతి పార్టీ కార్యకర్గ సభ్యులు, ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. యూపీఏ కూటమి విజయంపై తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు.
అనంతరం ఆదివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ తనకు ఫోన్ చేశారని, లౌకిక శక్తుల బలోపేతానికి సానుకూలంగా స్పందించాలని ప్రధాని కోరినట్లు మాయావతి చెప్పారు. ఇదిలా ఉంటే బీఎస్పీ జాతీయ కార్యకర్గ, పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వానికి బయట నుంచి బేషరతు మద్దతు అందించాలని బీఎస్సీ నిర్ణయించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|