|
| అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం |
| భువనేశ్వర్ (ఏజెన్సీ), 19 మే 2009 ( 13:13 IST ) | |
భారత్ మంగళవారం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని- 2 క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒరిస్సాలోని భద్రాక్ జిల్లాలో ఉన్న వీలర్స్ ద్వీపం నుంచి భారత శాస్త్రవేత్తలు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలం మీద లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఆర్మీ ఉపయోగార్థం నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆర్మీ సొంతంగా ఈ క్షిపణిని ప్రయోగించేలా విశ్వాసం కల్పించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. 20 మీటర్ల పొడవుంటే ఈ క్షీపణిని భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తయారు చేశారు. ఇది 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
16 టన్నుల బరువు ఉండే అగ్ని- 2 వెయ్యి కేజీలు పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు. పేలోడ్ తగ్గించడం ద్వారా ఈ క్షిపణి సామర్థ్యాన్ని 3000 కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు. రైలు, రోడ్డు మొబైల్ లాంఛర్ల సాయంతో వీటిని ప్రయోగించవచ్చు. ప్రయోగానికి క్షిపణిని సిద్ధం చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే అవసరం అవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించారు. అగ్ని శ్రేణి క్షిపణుల ప్రయోగాన్ని భారత్ తొలిసారి 1999లో నిర్వహించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|