యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 10:04 IST )
కొత్త మంత్రివర్గం ఆర్జేడీ, ఎస్పీలకు చోటు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. మమ్మల్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపించాయి. ఆర్జేడీ అధినేత లాలూ, ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ సోమవారం మాట్లాడుతూ.. కొంతమంది కాంగ్రెస్ నేతలు తమను అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు.

అయినా తాము యూపీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. యూపీఏ మిత్రపక్షాలపై కొందరు కాంగ్రెస్ నేతలు అమర్యాదకర వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం తన దృష్టిలో పెద్ద విషయం కాదని లాలూ పేర్కొన్నారు. యూపీఏకి తమ మద్దతు అవసరం లేకుండా, ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ అధినేత మూలాయం సింగ్ యాదవ్ చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రధాని రాజీనామా: త్వరలో కొత్త ప్రభుత్వం
ప్రధాని అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు: మోడీ
ప్రతిపక్ష నేతగా కొనసాగనున్న ఎల్‌కే అద్వానీ
మన్మోహన్ రాజీనామా: 14వ లోక్‌సభ రద్దు
లోక్‌‍సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు
మేం అధికారం కోసం చూడటం లేదు: అమర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...