యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ప్రధాని రాజీనామా: త్వరలో కొత్త ప్రభుత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 09:47 IST )
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అందజేశారు. ఆయనతోపాటు, ఇతర కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. కేంద్ర మంత్రివర్గ సిఫార్సుపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14వ లోక్‌సభను రద్దు చేశారు.

ఇటీవల జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూపీఏ కూటమి పక్షాల మధ్య తిరిగి అధికారం చేపట్టేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

రాజీనామా చేసిన అనంతరం కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మన్మోహన్‌ను రాష్ట్రపతి కోరారు. పాత కేంద్ర మంత్రివర్గం కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగనుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రధాని అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు: మోడీ
ప్రతిపక్ష నేతగా కొనసాగనున్న ఎల్‌కే అద్వానీ
మన్మోహన్ రాజీనామా: 14వ లోక్‌సభ రద్దు
లోక్‌‍సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు
మేం అధికారం కోసం చూడటం లేదు: అమర్
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...