|
| ప్రధాని అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు: మోడీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009 ( 17:51 IST ) | |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని అభ్యర్థిగా తననితాను ఎప్పుడూ చెప్పుకోలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. తాను పార్టీ భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదన్నారు. తన వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందన్నారు. తాను గుజరాత్‌కు పరిమితమయ్యానని, రాష్ట్రం కోసమే పనిచేస్తానని మోడీ సోమవారం పేర్కొన్నారు.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం నరేంద్ర మోడీ తొలిసారి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కన్వీనర్, జేడీయు నేత శరద్ యాదవ్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి అనే ప్రచారం మీడియా సృష్టేనని, ఈ విధంగా తానెప్పుడూ చెప్పలేదన్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం శరద్ యాదవ్ మాట్లాడుతూ.. మోడీని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం తప్పిదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీ ప్రతిపక్షం కూర్చోవాలని కోరుకున్నారు. తాము ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే అంతిమమన్నారు. ఈ ఎన్నికల్లో యూపీఏ అధికారంలో ఉండేందుకు ప్రజామోదం లభించిందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|