|
| మేనక క్షమాపణ చెప్పాలి: మాయావతి డిమాండ్ |
| లక్నో (ఏజెన్సీ), శనివారం, 4 ఏప్రిల్ 2009 ( 15:50 IST ) | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బీజేపీ నేత మేనకా గాంధీపై నిప్పులు చెరిగారు. మాయావతి శనివారం మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి తల్లి బాధ తెలుసుంటే.. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ మైనారిటీలపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను సమర్థించేవారు కాదని విమర్శించారు.
మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుణ్ గాంధీపై జాతీయ భద్రతా చట్టాన్ని (నాసా) ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్‌పై నాసా ప్రయోగించడాన్ని మేనకా గాంధీ వ్యతిరేకించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ యూపీ ముఖ్యమంత్రి మాయావతికి తల్లి బాధ అర్థం కాదని, ఎందుకంటే ఆమె ఎవరికీ జన్మనివ్వలేదని మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మాయావతి తీవ్రంగా స్పందించారు. మేనకా గాంధీ మంచి తల్లి అయి ఉంటే వరుణ్ గాంధీకి సరైన విలువలు నేర్పివుండేవారని మాయావతి విమర్శించారు. మేనకా గాంధీ కుమారుడికి మంచి విలువలు నేర్పించివుంటే, వరుణ్ జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. తననుద్దేశించి చేసిన అవమానకర, దురదృష్టకర వ్యాఖ్యలపై మేనకా గాంధీ తనకే కాకుండా, దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని మాయావతి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|