|
| సంజయ్ రాజకీయ ప్రవేశం: లక్నో నుంచి పోటీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009 ( 18:02 IST ) | |
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంజయ్ వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మక లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నాడు. లక్నో నుంచి సంజయ్ తమ పార్టీ తరపున పోటీ చేస్తారని సమాజ్ వాదీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ.. సంజయ్‌పై ఉన్న క్రిమినల్ కేసుల కారణంగా ఆయనను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించకపోతే, తాము ఎన్నికల సంఘాన్ని లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ సోదరి సోదరి ప్రియాదత్ ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నికయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం లక్నో నియోజకవర్గం నుంచి మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్‌తోపాటు, భోజ్‌పురీ సూపర్‌స్టార్ మనోజ్ తివారీ కూడా సమాజ్‌వాదీ టిక్కెట్‌పై గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న రాంపూర్ ఎంపీ, నటి జయప్రద మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|