|
| భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది: ప్రణబ్ ముఖర్జీ |
| చెన్నై (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009 ( 17:44 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడులపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చిచెప్పారు. ముంబయి దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది కసబ్ తమకు అంతా చెప్పాడని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు బుధవారం కసబ్ తమ దేశీయుడేనని అంగీకరించిన సంగతి తెలిసిందే.
పాక్ ఇంతకుముందు చేసిన ప్రకటనలకు, తాజాగా అంగీకరించిన వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండటంపై ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. ముంబయి దాడుల్లో పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది అయిన కసబ్ తమకు జరిగిదంతా వెల్లడించాడని తెలిపారు.
అతను ఏ దేశానికి చెందినవాడో, ఎక్కడ తీవ్రవాద శిక్షణ తీసుకున్నాడో, హతమైన మిగిలిన తొమ్మిది మంది తీవ్రవాదులతో కలిసి సముద్రమార్గం గుండా భారత్ ఏలా వచ్చింది.. అన్ని విషయాలను కసబ్ వెల్లడించాడన్నారు. అయితే తొలి రోజు నుంచి పాకిస్థాన్ ముంబయి దాడులతో తమ దేశీయులకు సంబంధం ఉందనే వాదనను తోసిపుచ్చుతూనే ఉందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|