యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పాక్ వాదన కూడా నమ్మశక్యంగా లేదు: భారత్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 12:37 IST )
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తామందించిన సాక్ష్యాధారలపై పొరుగు దేశం వినిపిస్తున్న వాదనలోనూ విశ్వసనీయత లేదని భారత్ ఎదురుదాడికి దిగింది. ముంబయి దాడులపై భారత్ అందించిన సాక్ష్యాలు, తాము చర్యలు తీసుకునేందుకు సరిపోవని పాక్ ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాక్ష్యాలు అందించిన తరువాత కూడా పాకిస్థాన్ పాత ధోరిణితోనే వ్యవహరిస్తుందని పేర్కొంది. పాక్ వాదనలోనూ విశ్వసనీయత లేదు. ఇంతకుముందులాగే వాస్తవాలను, సాక్ష్యాధారాలను పాక్ తోసిపుచ్చుతుంది. వాళ్లు (పాకిస్థాన్) ఏదో ఒకటి చెబుతారు. కాని చేసిది మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

ముంబయి దాడులు జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు పాక్ వాస్తవాలను తోసిపుచ్చే ధోరణితోనే వ్యవహరిస్తుందని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విమర్శించారు. భారత్ అందించిన సాక్ష్యాలపై పాక్ స్పందనను ప్రస్తావించగా, ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు ఈ సాక్ష్యాలను అసలు పరిశీలించాయా? వాటిపై దర్యాప్తు జరిపాయా? అని ప్రశ్నలు సంధించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి: ఆంటోనీ
చెన్నైలో నేటి నుంచి ప్రవాస భారతీయ దివస్
26/11 దాడులకు పాక్ ప్రభుత్వ సంస్థల మద్దతు
నిర్మాణాత్మక, సత్వర చర్యలు కావాలి: చిదంబరం
26/11 దాడులు: 19 వరకు అజ్మల్‌కు పోలీసు కస్టడీ
తీవ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగిస్తున్న పాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...