యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
26/11 దాడులకు పాక్ ప్రభుత్వ సంస్థల మద్దతు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 09:15 IST )
ముంబయి ఉగ్రవాద దాడుల (26/11) కుట్రదారులకు పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల మద్దతు కూడా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఉగ్రవాదం పాకిస్థాన్ ప్రభుత్వ విధానంలో ఒక భాగమన్నారు. పాక్‌లో ఉగ్రవాదం ప్రభుత్వ విధానంలో ఒక ఉపకరణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల మద్దతుతోనే లష్కరే తోయిబా ముంబయిలో దాడులకు పాల్పడిందని ప్రధాని పేర్కొన్నారు.

దేశ రాజధానిలో అంతర్గత భద్రతపై మంగళవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదం ప్రధానంగా విదేశాలు, ముఖ్యంగా పాక్ నుంచే వ్యాపిస్తుందన్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును పరిశీలిస్తే.. ముంబయి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వ సంస్థల మద్దతు లభించిందనే విషయం స్పష్టమవుతోందన్నారు.

దాడుల్లో విదేశీయులు మృతి చెందడంపై, సంబంధిత దేశాలు జరిపిన దర్యాప్తులోనూ ఇదే విషయం తెలుస్తోందన్నారు. ముంబయి మారణహోమంలో లష్కరే తోయిబా హస్తం ఉందనేందుకు అవసరమైన ఆధారాలు సేకరించామని చెప్పారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ నుంచి కూడా దీనిని నిరూపించే ఆధారాలు లభించాయని వెల్లడించారు. పొరుగుదేశం యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నప్పటికీ, భారత్ సంయమనం పాటిస్తుందని ప్రధాని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిర్మాణాత్మక, సత్వర చర్యలు కావాలి: చిదంబరం
26/11 దాడులు: 19 వరకు అజ్మల్‌కు పోలీసు కస్టడీ
తీవ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగిస్తున్న పాక్
రెండో రోజుకు చేరుకున్న ట్రక్కుల సమ్మె
కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలి: భారత్
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...