|
| నిర్మాణాత్మక, సత్వర చర్యలు కావాలి: చిదంబరం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 19:09 IST ) | |
తీవ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రవాదానికి సంబంధించిన విషయాల్లో స్పందన వేగంగా, బలంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని పేర్కొన్నారు.
దేశ రాజధానిలో అంతర్గత భద్రతపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ.. తీవ్రవాదంపై పోరుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. తీవ్రవాదంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి మధ్య సమన్వయం ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రజల భద్రతకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ జరుగుతున్న ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధ స్థాయిని మరింత పెంచాలని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తీవ్రవాద ముప్పులకు స్పందన బలంగా, వేగవంతంగా, నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు.
కింది స్థాయిల్లో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికీ కింది స్థాయిల్లో పోలీసులే అత్యుత్తమ నిఘా వర్గాలుగా పనిచేస్తున్నారు. స్థానిక పోలీసుల స్థాయిలోనే నిఘా వ్యవస్థను పటిష్టపరచడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని కోరారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించాలని చెప్పారు.
ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జాతీయ భద్రతా దళ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తీవ్రవాద నిరోధక దళాలను ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 1 నుంచి నిఘా సంస్థల సమన్వయంతో పనిచేసే మల్టీ ఏజెన్సీ కేంద్రాలు పని చేయడం ప్రారంభించాయని చిదంబరం వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|