యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
26/11 దాడులు: 19 వరకు అజ్మల్‌కు పోలీసు కస్టడీ
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 17:14 IST )
ముంబయి మారణహోమంలో భారత భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమీర్ ఇమాన్ అలియాస్ కసాబ్‌‍కు మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం జనవరి 19 వరకు పోలీసు కస్టడీని ఆదేశించింది.

దక్షిణ ముంబయిలోని అజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదయిన కామా ఆస్పత్రి కాల్పుల కేసుకు సంబంధించి కసబ్‌ను ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తన తరపు వాదన వినిపించేందుకు న్యాయవాది లేని కసబ్‌‍ను ఈ రోజు కూడా భద్రతాపరమైన కారణాలతో కోర్టులో హాజరుపరచలేదు.

కామా ఆస్పత్రి వద్ద జరిగిన కాల్పులపై విచారణ జరిపేందుకు కసబ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈబీ ధమాల్ తెలిపారు.

కామా ఆస్పత్రి వద్ద నవంబరు 26న జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులతోపాటు, ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. అజ్మల్ ప్రస్తుతం మరో మూడు కేసుల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తీవ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగిస్తున్న పాక్
రెండో రోజుకు చేరుకున్న ట్రక్కుల సమ్మె
కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలి: భారత్
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం
పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్
పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...