యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
తీవ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగిస్తున్న పాక్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 16:40 IST )
తీవ్రవాదాన్ని పాకిస్థాన్ దేశ విధానంగా ఉపయోగించుకుంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ముంబయి మారణహోమంలో వారి దేశీయుల ప్రమేయం ఉందనే వాదనతో పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకీభవించని సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆ దేశంలోని కొన్ని అధికారిక సంస్థలు కూడా ముంబయి దాడులకు మద్దతు ఇచ్చి ఉంటాయన్నారు. పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థలు భారత్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు నేపాల్, బంగ్లాదేశ్‌లను కూడా ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు.

నియంత్రణ రేఖపై కూడా చొరబాట్లు కొనసాగిస్తూనే, కొత్త మార్గాలపై కూడా పాక్ తీవ్రవాద సంస్థలు దృష్టి పెట్టాయన్నారు. అంతర్గత భద్రతపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడిందని చెప్పారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పాక్ కుట్రపన్నుతోందని ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉగ్రవాదంపై సహనం పాటించడం ఇక సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత భద్రతపై దృష్టి సారించాలని కోరారు. సముద్రతీర భద్రతను పటిష్టపరచాల్సిన అవసరం ఉందన్నారు. చొరబాట్లు, తీవ్రవాదాన్ని అరికట్టేందుకు నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెండో రోజుకు చేరుకున్న ట్రక్కుల సమ్మె
కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలి: భారత్
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం
పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్
పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...