యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రెండో రోజుకు చేరుకున్న ట్రక్కుల సమ్మె
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 11:40 IST )
దేశవ్యాప్తంగా ట్రక్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. పర్మిట్లు రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ట్రక్కు యజమానులు వెనక్కు తగ్గలేదు. దీంతో మంగళవారం కూడా ట్రక్కుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఏఐఎంటీసీ అధ్యక్షుడు చరణ్ సింగ్ లోహరా తెలిపారు.

కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి బ్రహ్మదత్ సోమవారం ట్రక్కుల సమ్మె కొనసాగితే, వారి పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా తొలిరోజు ట్రక్కులు, లారీల సమ్మె రవాణా వ్యవస్థను పాక్షికంగా ప్రభావితం చేసింది. సుమారు 50 లక్షలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయని అఖిల భారత వాహన రవాణా కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) వెల్లడించింది.

మరోవైపు లారీ, ట్రక్కు యజమానుల డిమాండ్లు అసంబద్ధమైనవని బ్రహ్మదత్ పేర్కొన్నారు. సమ్మె కొనసాగితే వాహనాల పర్మిట్లు రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ప్రజలకు అందేలా చూస్తామని, అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) ప్రయోగించినా, వాహనాల పర్మిట్లు రద్దు చేసినా తాము మద్దతు ఇస్తామని చెప్పారు.

ట్రక్కుల నిరవధిక సమ్మెపై కఠినంగా వ్యవహరించినా, మరోవైపు కేంద్రం బుజ్జగింపు చర్యలు కూడా చేపట్టింది. రవాణా ఏజెన్సీలకు సబ్ కాంట్రాక్టర్లు అందించే ఎనిమిది సేవలపై సర్వీసు ట్యాక్సును మినహాసిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు సరిపోవని చరణ్ సింగ్ స్పష్టం చేశారు.

వాహనాల పర్మిట్లు రద్దు చేస్తే, తదనంతర పరిణామాలకు తాము బాధ్యత వహించబోమన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సమ్మె శాంతియుతంగా జరుగుతోంది. పర్మిట్లు రద్దు చేస్తే.. దాని పర్యవసానాలు తమ నియంత్రణలో ఉండవన్నారు. మరో రెండు రోజుల్లో నిత్యావసర వస్తువుల సరఫరానూ నిలిపివేస్తామని చరణ్ సింగ్ హెచ్చరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలి: భారత్
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం
పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్
పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు
ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...