|
| జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం |
| జమ్ము (ఏజెన్సీ), 5 జనవరి 2009 ( 15:56 IST ) | |
జమ్మూకాశ్మీర్ 11వ ముఖ్యమంత్రిగా సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాచే ఆ రాష్ట్ర గవర్నర్ వోరా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఒమర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా తారాచంద్, మరో పదిమంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పలువురు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
జమ్మూ కాశ్మీర్‌కు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీరాని నేపధ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించగా కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|