|
| పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 14:13 IST ) | |
ముంబయిలో దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారేననే విషయాన్ని బలపర్చే సాక్షాలను తాము పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేశామని భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పాక్ తీవ్రవాదుల గురించి తాము సేకరించిన సాక్షాలను ఇతర ప్రపంచ దేశాలకు కూడా అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ పై వివరాలు తెలిపారు. ముంబయిలో జరిగిన ఘోరం క్షమించరానిదని దీనిపై పాక్ తక్షణం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రి చిదంబరం ముంబయి పేలుళ్ల నిందితుడు కసబ్‌కు సంబంధించిన వివరాలను అమెరికాకు అందించనున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.
అదేసమయంలో అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ముంబయి పేలుళ్లపై తాను సేకరించిన సాక్షాలను పాకిస్థాన్‌కు అందజేసినట్టు తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|