|
| పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ |
| జమ్ము (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 10:56 IST ) | |
జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య సాగుతున్న ఎన్‌కౌంటర్ సోమవారం కూడా కొనసాగుతోంది. దీంతో ఈ ఎన్‌కౌంటర్ ఐదోరోజుకు చేరుకుంది. ఈ ఎన్‌కౌంటర్ కారణంగా ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులతో సహా ముగ్గురు సైనికులు మృతి చెందారు.
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలకు చెందినవారు పూంచ్ సెక్టార్‌లో స్థావరాలు ఏర్పరచుకున్నారన్న వార్తలు రావడంతో భద్రతా దళాలు ఈ ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ ఉన్న తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.
తీవ్రవాదుల నుంచి ప్రతి ఘటన ఏమాత్రం తగ్గకపోవడంతో గత ఐదురోజులుగా ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|