యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణం
జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 08:46 IST )
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన ఒమర్‌అబ్ధుల్లా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ వర్శిటీలోని జనరల్ జొరావర్ స్టేడియం ఒమర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదికకానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జమ్మూ చేరుకున్న ఒమర్‌అబ్ధుల్లా ఆయన సతీమణిలకు జమ్మూ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేంద్ర కార్యాలయం వరకు పదికిలోమీటర్ల మేర ఒమర్‌ దంపతులు ఊరేగింపుగా పయనించారు. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతుదారులు ఒమర్‌కు బ్రహ్మరధం పట్టారు.

ఈ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్‌అబ్ధుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒమర్ పేరును ఫరూక్ అబ్ధుల్లా ప్రతిపాదించగా 25 మంది ఎమ్మల్యేలు మద్దతిచ్చారు.

జమ్మూకాశ్మీర్‌కు తాజాగా ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అక్కడి కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికార పీటాన్ని అలంకరించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏర్పడనున్న ఈ కూటమి ప్రభుత్వంలో రానున్న ఆరేళ్ల కాలం పాటు ఒమర్అబ్ధుల్లానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదేసమయంలో కూటమిలోని మరో పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు
పూంచ్‌లో కొనసాగుతున్న భీకర కాల్పులు
కో‌లోకతాలో ఆటోడ్రైవర్ల బంద్‌లో ఘర్షణలు
మనోజ్ గుప్తా కేసులో సాక్షాలు లభ్యం: డీజీపీ
యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధాని
పేరు మార్చినా నిషేధం విధించాల్సిందే: ప్రణబ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...