|
| కోలోకతాలో ఆటోడ్రైవర్ల బంద్‌లో ఘర్షణలు |
| కోల్‌కతా (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 17:07 IST ) | |
హైకోర్టు విధించిన నిషేధానికి నిరసనగా కోల్‌కతాలో ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ బంద్ కారణంగా రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు మూడు బస్సులు, మరికొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు.
కాలుష్యానికి కారణమవుతున్న ఆటోలపై నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని ఆటోడ్రైవర్లు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ బంద్‌కు తృణముల్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రోడ్లపైకి చేరిన ఆటోడ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పెరిగి పెద్దదైంది. దీంతో ఆగ్రహించిన ఆటోడ్రైవర్లు రోడ్లపై హింసాత్మక చర్యలకు పూనుకున్నారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసు బలగాలను రంగంలో దింపేందుకు పోలీసుశాఖ సిద్ధమైందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|