|
| ఒమర్‌కే పూర్తికాలం జమ్మూకాశ్మీర్ పగ్గాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 08:53 IST ) | |
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా జనవరి 5న ప్రమాణ స్వీకారం చేయనున్న ఒమర్ అబ్ధుల్లాకు కాంగ్రెస్ పార్టీ ఓ తీపి కబురు అందించింది. జమ్మూకాశ్మీర్‌లో రానున్న ఆరేళ్లపాటు ఒమర్ అబ్ధుల్లానే ముఖ్యమంత్రిగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది.
ఈ విషయమై శుక్రవారం ఒమర్ అబ్ధుల్లా మాట్లాడుతూ రానున్న ఆరేళ్లపాటు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి పగ్గాలు తానే చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏ పార్టీకీ పూర్తి మద్దతురాని కారణంగా ఒమర్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.
దీంతో ఇరు పార్టీలు రోటేషన్ పద్ధతిలో మూడేళ్లపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాయనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒమర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తల్లో నిజం లేదనే విషయం తేలిపోయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|