|
| జనవరి చివర్లో అభ్యర్ధుల ప్రకటన: బీజేపి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 2 జనవరి 2009 ( 16:48 IST ) | |
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల జాబితాను జనవరి నెలాఖరులోగా ప్రకటించనున్నట్టు బీజేపీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్ధుల జాబితాను రెండు విడతలుగా ప్రకటించనున్నట్టు ఆ పార్టీ తెలిపింది.
ఈ విషయమై బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అభ్యర్ధులను ఖరారు చేస్తుందని చెప్పారు. బోర్డు తొలి విడత సమావేశం జనవరి 19 నుంచి 21 వరకు జరగనుందని అలాగే రెండో విడత సమావేశం 28,29 తేదీల్లో జరగనుందని ఆయన వివరించారు.
ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిది వరకు నాగపూర్‌లో జరగనున్న జాతీయ సమావేశాలకు ముందుగానే అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నట్టు జైట్లీ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|