|
| న్యాయమూర్తుల వేతలనాలు భారీగా పెంపు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 2 జనవరి 2009 ( 16:38 IST ) | |
సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన జీతాలను అమలులోకి తెచ్చేందుకు ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో న్యాయమూర్తుల వేతనాల పెంపు నిర్ణయాన్ని అమోదించారు. ఈ సమావేశం అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖ మంత్రి కపిల్ సిబాల్ మాట్లాడుతూ కేబినేట్ సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు. ఆరవ వేతన సంఘం సిఫారసుల మేరకు న్యాయమూర్తుల వేతనాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం సవరించిన ప్రకారం ఇకపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ. లక్ష వేతనంగా లభించనుంది. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రూ.90వేలు వేతనంగా లభించనుండగా మిగిలిన న్యాయమూర్తులకు రూ. 80వేలు వేతనంగా లభించనుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|