|
| గవర్నర్‌కు విలాస్‌రావ్ రాజీనామా లేఖ |
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 12:21 IST ) | |
మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అధికారికంగా గురువారం గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపారు. ఐదు రోజుల క్రితం రాజీనామా చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ విలాస్‌రావ్ చేసిన ప్రతిపాదనను బుధవారం కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కొత్త వ్యక్తి చేతుల్లో పెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ తదితరులు ముంబయి చేరుకున్నారు. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు గురువారం ప్రభుత్వ భాగస్వామి అయిన ఎన్‌సీపీతో సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఫృధ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర మంత్రులు నారాయణ్ రాణే, అశోక్ చౌహాన్, సీనియర్ నేత బాబా సాహేబ్ వికీ పాటిల్ తదితరులు ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|