యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
జైపూర్ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 11:16 IST )
రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గురువారం ఉదయం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ముంబయి తీవ్రవాద దాడుల నేపథ్యంలో ఈ ఎన్నికలకు అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

ఈ ఎన్నికల కోసం 42,212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 8,400 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

17.2 మిలియన్ల మంది మహిళలతోసహా 36 మిలియన్ల మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో 2193 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 154 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. అధికార బీజేపీ 193 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 200 స్థానాలకు, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) 199 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీఎస్‌టీలో రెండు టైం బాంబులు లభ్యం
దేశ్‌ముఖ్‌పై వేటు: కొత్త సీఎంపై నేడు నిర్ణయం
భారత్ పాక్ సహకరించాలి రైస్ ఉద్ఘాటన
ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...