యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
భారత్‌కు పాక్ సహకరించాలి: రైస్ ఉద్ఘాటన
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 4 డిసెంబర్ 2008   ( 09:03 IST )
పాకిస్థాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరికి బుధవారం అమెరికా కూడా గొంతు కలిపింది. ముంబయి తీవ్రవాద దాడులపై చర్చలు జరిపేందుకు భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ సమావేశమయ్యారు. ముంబయి దాడుల కుట్రదారులను పట్టుకునేందుకు భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని, వారి విషయంలో పారదర్శకంగా, అత్యవసరంగా వ్యవహరించాలని రైస్ ఉద్ఘాటించారు.

ఇదిలా ఉంటే గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... పాక్‌పై సైనిక చర్యకు దిగకుండా ఉండే అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేదు. ముంబయి దాడులకు పాకిస్థాన్ నుంచి కుట్ర జరిగిందని పునరుద్ఘాటించారు. తీవ్రవాదంపై పోరుకు అమెరికా అందిస్తున్న సాయాన్ని ప్రణబ్ ఈ సందర్భంగా స్వాగతించారు. ముంబయి దాడుల కుట్రదారులను శిక్షించేందుకు సహకరించాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.

ముంబయి దాడులపై దేశంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుందన్నారు. భారత్ స్వీయరక్షణ హక్కు కలిగివుందన్నారు. తమ దేశ సమగ్రతను కాపాడుకునేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్‌లపై పాకిస్థాన్ స్పందనను బట్టే భారత్ చర్యలు తీసుకుంటుందని ప్రణబ్ వివరించారు. ఈ దాడులకు కారణమైన తీవ్రవాదులను అరెస్టు చేసి, న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాలని భారత్ కోరుకుంటుందన్నారు.

మిత్రదేశాలు, అంతర్జాతీయ సమాజం తీవ్రవాదులను పట్టుకోవడంలో తమకు సహకరిస్తాయని భావిస్తున్నామన్నారు. పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం పంపే స్పందనపైనే భారత్ తీసుకోబోయే చర్యలు ఆధారపడి ఉంటాయని ప్రణబ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి తమ డిమాండ్‌లపై ఇప్పటి వరకు స్పందన రాలేదని చెప్పారు. దాని కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ మాట్లాడుతూ.. ముంబయి తీవ్రవాద దాడుల బాధితులకు సానుభూతి తెలిపారు. భారత ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దర్యాప్తులో పూర్తిస్థాయి సహకారం అందిస్తామన్నారు. ఈ తీవ్రవాద దాడుల మూలాల వరకు దర్యాప్తును తీసుకెళతామని వ్యాఖ్యానించారు. తీవ్రవాదులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టడంలో పాకిస్థాన్‌కు ప్రత్యేక బాధ్యత కలిగివుందన్నారు.

ముంబయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులకు అల్ ఖైదా తీవ్రవాద సంస్థ సహకారం కూడా పొంది ఉండవచ్చని రైస్ అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రవాదంపై పోరులో అమెరికాకు అనుభవం ఉందని, భారత్‌కు కూడా ఇందులో సహకరిస్తామని చెప్పారు.

తీవ్రవాదులకు జాతీయత ఉండదంటూ పాకిస్థాన్ వినిపిస్తున్న వాదనతో రైస్ ఈ సందర్భంగా విభేదించారు. తీవ్రవాదులకు జాతీయత లేనప్పటికీ, వారి ఏదో ఒక దేశం నుంచి దాడులు చేస్తున్నారని, పాకిస్థాన్ కూడా వారి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే రైస్ గురువారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనూ ముంబయి దాడులపైనే ప్రధానంగా చర్చలు జరుగనున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సీఎస్‌టీలో రెండు టైం బాంబులు లభ్యం
దేశ్‌ముఖ్‌పై వేటు: కొత్త సీఎంపై నేడు నిర్ణయం
ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...