|
| ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 13:14 IST ) | |
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ బుధవారం భారత పర్యటనకు వచ్చారు. ఆమె ఈ ఒక రోజు పర్యటనలో ముంబయిలో గత వారం జరిగిన తీవ్రవాద దాడులపై చర్చలు జరిపారు. తీవ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రస్తుతం భారత పర్యటకు విచ్చేశారు.
భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకొని రైస్ ముంబయి తీవ్రవాద దాడులపై చర్చలు జరుపనున్నారు. ముంబయి తీవ్రవాద దాడుల్లో పాకిస్థాన్ శక్తుల పాత్ర ఉన్నట్లు భారత్ బలంగా విశ్వసిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను తాజా చర్చల్లో ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌లను కూడా రైస్ కలుసుకోనున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|