యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 12:53 IST )
కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ వివాదస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడం విచారకరమని సీపీఎం పేర్కొంది. జాతీయ భద్రతా దళానికి చెందిన కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ ఇంటికి వెళ్లిన సందర్భంగా అచ్యుతానందన్ మాట్లాడుతూ... సందీప్ ఇల్లు కాబట్టే వచ్చామని, లేకపోతే ఈ ఇంటివైపు కుక్కలు కూడా చూడవని వ్యాఖ్యానించారు.

ఈ వివాదస్పద వ్యాఖ్యలపై అధికారి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మంగళవారం క్షమాపణ చెప్పారు. అచ్యుతానందన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు విచారకరంగా ఉన్నాయన్నారు. ఈ వివాదంపై ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. కుటంబసభ్యులను పరామర్శించేందుకు, సానుభూతి తెలిపేందుకే అచ్యుతానందన్ అక్కడికి వెళ్లారు.

ఇందులో వేరే ఉద్దేశాలేమీ లేవని కారత్ వివరించారు. అంతకుముందు సందీప్ ప్రాణత్యాగంపై సరైన సమయంలో స్పందించనందుకు, ఆయన తండ్రి ఉన్నికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ ఆగ్రహానికి గురైన అచ్యుతానందన్, అనంతరం మాట్లాడుతూ.. పైవివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో గత వారం జరిగిన తీవ్రవాద దాడుల్లో జాతీయ భద్రతా దళ కమాండో సందీప్ ప్రాణత్యాగం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...