యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 11:45 IST )
ముంబయిలో గత వారం తీవ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలు అరెస్టు చేసిన తీవ్రవాది పాకిస్థానీయుడేనని ముంబయి పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన తీవ్రవాది తాను పాకిస్థాన్ దేశీయుడనేనని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో పాల్గొన్న పది మంది తీవ్రవాదులకు మాజీ ఆర్మీ అధికారులు శిక్షణ ఇచ్చినట్లు ఈ తీవ్రవాది చెప్పాడు.

ముంబయి తీవ్రవాద దాడుల్లో అజ్మల్ అమీన్ కమల్ అనే తీవ్రవాదిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. మిగిలిన తీవ్రవాదులందరూ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. అజ్మల్ అమీన్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌కు చెందినవాడని ముంబయి పోలీసు కమిషనర్ హసన్ గఫూర్ వెల్లడించారు.

దాడుల్లో పాల్గొన్న పది మంది తీవ్రవాదులు కరాచీ నుంచి నౌకలో భారత జలాల్లోకి వచ్చారు. అనంతరం ఒక చిన్న పడవను హైజాక్ చేసి ముంబయి సముద్ర తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. పది మంది తీవ్రవాదుల్లో కొందరు మాజీ ఆర్మీ అధికారుల వద్ద ఏడాదికిపైగా శిక్షణ పొందారని గఫూర్ పేర్కొన్నారు.

అయితే తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చిన మాజీ ఆర్మీ అధికారులు ఏ దేశానికి చెందినవారనే ప్రశ్నకు ఆయన స్పందించలేదు. దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్లు ఏదైనా ఆధారం దొరికిందా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ... ప్రస్తుతం ఈ దాడులపై విచారణ కొనసాగుతోందని, ఇందులో పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే తాము దానిని వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే ముంబయిలో జరిగిన తాజా దాడుల్లో స్థానికుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలేమీ దొరకలేదని గఫూర్ చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
వాళ్లనిక్కడ ఖననం చేయొద్దు: ముస్లిం కౌన్సిల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...