|
| మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ |
| ఐజ్వాల్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 09:27 IST ) | |
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మిజోరాం అసెంబ్లీలోని 40 సీట్లకు మంగళవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మిజోరాం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆర్ బాలకృష్ణన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 72 శాతం పోలింగ్ నమోదయిందని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రదేశాల్లో చాలా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి పోలింగ్ వివరాలు సమయానికి అందలేదన్నారు. 72 శాతం వరకు పోలింగ్ నమోదయి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.
పోలింగ్‌కు సంబంధించి స్పష్టమైన గణాంకాలు బుధవారం సాయంత్రానికి తెలుస్తాయని చెప్పారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, యూనైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్ (యూడీఏ) ప్రత్యర్థులు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|