యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:05 IST )
ముంబయిలో దాడులకు కుట్ర పన్నిన తీవ్రవాదులకు తగిన రీతిలో జవాబిస్తామని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. సమగ్రతను కాపాడుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని ప్రణబ్ సోమవారం ఎన్డీటీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాకిస్థాన్ నుంచి జరుగుతున్న ఈ తీవ్రవాద దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

పాకిస్థాన్‌లోని తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రణబ్ మాట్లాడుతూ.. దాడులకు దిగితే అందరికీ తెలుస్తుంది. అయినా దాడులను ముందుగా ప్రకటించి లేదా ప్రచారం చేసి చేయరని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్‌‍పై దాడులకు దిగుతామని చెప్పట్లేదన్నారు. ఆ దేశంపై దాడులకు దిగబోమన్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కు నిరసన పత్రం సమర్పించాము.

దీనిపై పాక్ స్పందన కోసం వేచి చూస్తున్నాము. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ పఫీజ్ మహ్మద్, జేషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తదితర 20 మంది నేరస్తులను అప్పగించాలని కోరుతూ పాకిస్థాన్‌కు ఉగ్రవాద జాబితాను అందజేశామని ప్రణబ్ వివరించారు. మరోవైపు పాకిస్థాన్ ఈ దాడులపై ఉమ్మడి దర్యాప్తు జరుపుదామని చేసిన ప్రతిపాదనను భారత్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఇటువంటి వ్యవస్థ ఇప్పటికే ఉందని, తీవ్రవాదుల అప్పగింతపై నేరుగా స్పందించాలని పాకిస్థాన్‌ను భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
వాళ్లనిక్కడ ఖననం చేయొద్దు: ముస్లిం కౌన్సిల్
సందీప్ ఇల్లు కాబట్టే వెళ్లాం: కేరళ సీఎం
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజీనామా ప్రతిపాదన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...