|
| పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 15:18 IST ) | |
ముంబయి తీవ్రవాద దాడుల వెనుక పాకిస్థాన్ శక్తుల ప్రమేయం ఉందని బలంగా విశ్వసిస్తోన్న భారత్ మంగళవారం నేరస్థుల అప్పగింతపై పాకిస్థాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. పాక్ హై కమిషనర్‌కు నేరస్థులను అప్పగించాలని డిమాండ్ చేస్తూ భారత్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని భారత్ విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విలేకరులతో చెప్పారు.
ముంబయి తీవ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌పై మిలటరీ చర్యకు దిగే ఆలోచనలేవీ పరిశీలనలో లేవని ప్రణబ్ స్పష్టం చేశారు. మరోవైపు నవంబరు 26న భారత ఆర్థిక రాజధానిపై జరిగిన తీవ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న కొన్ని శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. సోమవారం సాయంత్రం పాక్ హై కమిషనర్‌కు అందజేసిన లేఖలో భారత్ కొంత మంది నేరస్థులను తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా ముంబయిలో గత వారం జరిగిన తీవ్రవాద దాడుల్లో ప్రమేయం ఉన్నవారిపై ఏడు రోజుల్లోగా కఠిన చర్యలు భారత్ ఈ నిరసన పత్రంలో అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఈ లేఖపై ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... భారత చట్టాల పరిధిలో నేరస్తులైన వ్యక్తుల పేర్లను ఈ లేఖ ద్వారా మరోసారి పాకిస్థాన్‌కు అందజేశాము. ఇప్పటికే భారత్ 20 మంది తీవ్రవాదుల జాబితాను పాకిస్థాన్‌కు పంపింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరందరూ పాకిస్థాన్‌లోనే ఉంటున్నారు. ముంబయిపై తాజాగా జరిగిన దాడుల వెనుక కూడా వీరి ప్రమేయం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|