యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
గౌహతి (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 12:12 IST )
అసోం రాష్ట్రంలో మంగళవారం ఒక ప్యాసింజర్ రైలులో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలు దిఫు రైల్వే స్టేషన్‌లో ఉండగా ఈ బాంబు పేలుడు సంభవించింది. అసోం రాజధాని గౌహతికి ఈ రైల్వే స్టేషన్ 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ రైలు గౌహతి నుంచి టిన్సుకియాకు వెళుతోంది. రైలు దిఫు రైల్వే స్టేషన్‌లో నిలిపివున్న సమయంలో రద్దీగా ఉన్న ఒక కోచ్‌లో బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక ప్రయాణికుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడు బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
వాళ్లనిక్కడ ఖననం చేయొద్దు: ముస్లిం కౌన్సిల్
సందీప్ ఇళ్లు కాబట్టే వెళ్లాము: కేరళ సీఎం
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజీనామా ప్రతిపాదన
తీవ్రవాద దాడులు: ఆర్ఆర్ పాటిల్ రాజీనామా
గత నాలుగేళ్లలో 7000 మంది పౌరుల మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...