|
| మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం |
| ఐజ్వాల్ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 12:12 IST ) | |
మిజోరాం అసెంబ్లీలోని 40 సీట్లకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్, అసోం, త్రిపుర, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ రాష్టంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో 6,11,124 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు.
తొమ్మిది మంది మహిళలు, 36 మంది స్వతంత్రులతో సహా మొత్తం 205 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మిజోరాం రాష్ట్రం (1987) ఏర్పాటయిన తరువాత నాలుగోసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 39 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది.
కాంగ్రెస్, యునైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్ ఎంఎన్ఎఫ్‌కు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ 40 స్థానాలకు పోటీ చేస్తుండగా, మిజోరాం పీపుల్స్ కాన్ఫెరెన్స్ (ఎంపీసీ), జోరం నేషనల్ పార్టీ (జెడ్ఎన్‌పీ)ల కూటమి 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ, లోక్ భారతీ, ఎన్‌సీపీ పార్టీలు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|