|
| సరళీకరణ విధానాలకు సోనియా గాంధీ ఓటు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 15:58 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని దేశంపై పడకుండా చూసేందుకు సరళీకరణ విధానాలను జాగ్రత్తగా అమలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరళీకరణ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సోనియా వ్యాఖ్యానించారు.
అయితే వీటిని జాగ్రత్తగా అమలు చేయాలన్నారు. సామాజిక న్యాయం ఇందుకు బలి కాకూడదని పేర్కొన్నారు. హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో సోనియా గాంధీ మరో అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. 60వ దశకంలో ఇందిరా గాంధీ దేశంలో బ్యాంకులు జాతీయం చేయడాన్ని సోనియా ఈ సందర్భంగా సమర్థించారు.
ఈ చర్య వలన ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని భారతీయ బ్యాంకులు నిలబడ్డాయన్నారు. సంక్షోభం ప్రభావం లేకుండా అవి సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిణామాలు బ్యాంకులు జాతీయం చేయడం సరైనదేనని నిరూపిస్తున్నాయన్నారు.
ఇప్పుడు మనం ఈ ఆర్థిక తుపానును తట్టుకోగలిగే స్థితిలో ఉన్నామని సోనియా చెప్పారు. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఆర్థిక సంక్షోభం సద్దుమణిగిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. పారదర్శక, నియంత్రిత ఆర్థిక వ్యవస్థను కోరుకుంటున్నాము. భారత్ తిరిగి నియంత్రణల శకానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|