|
| మాలేగావ్ పేలుడు: సాధ్విపై మోకా ప్రయోగం |
| ముంబయి (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 11:14 IST ) | |
తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) గురువారం మాలేగావ్ పేలుడు కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తోపాటు పది మంది నిందితులపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టాన్ని (మోకా) ప్రయోగించింది.
సెప్టెంబరు 29నాటి మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఏటీఎస్ ఇప్పటివరకు పది మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరో అనుమానితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ కేసును ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టుకు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ నాసిక్ జిల్లా కోర్టులో జరుగుతోంది.
ఛార్జిషీటు దాఖలు చేయకముందు, సాధారణ కేసులో కంటే మోకా కేసులో పోలీసులు నిందితులను ఎక్కువకాలంపాటు కస్టడీలో ఉంచుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఏటీఎస్ దృష్టంతా మాలేగావ్ పేలుడు కేసుపైనే ఉందని, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ల కేసును పరిశీలించడం లేదని హేమంత్ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|