|
| పేలుళ్ల ప్రదేశాలను కాపాడండి: కేంద్ర ప్రభుత్వం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 10:14 IST ) | |
పేలుళ్ల సంభవించిన ప్రదేశాల్లో తరచుగా ఆధారాలు నాశనం అవుతుండటాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించే వరకు పేలుళ్లు జరిగిన ప్రదేశాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
పేలుళ్లు జరిగిన వెంటనే ఆ ప్రదేశాన్ని బ్యారికేడ్లతో మూసివేయాలని, ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ ప్రదేశాలను కాపాడాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా తెలిపారు. సంఘటనా స్థలాలను కాపాడటంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవడంపై కేంద్రం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
పేలుళ్ల ప్రదేశాలను సరిగా కాపాడకపోవడం వలన ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించలేకపోతున్నారు. దీని వలన దర్యాప్తుకు అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లోకి అనధికారిక వ్యక్తులను కూడా అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|