యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పీఎస్‌యూ ఉద్యోగుల వేతన పెంపుకు ఆమోదం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 16:02 IST )
ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌‍యూ) పని చేస్తున్న అధికారులకు కేంద్ర ప్రభుత్వం గురువారం శుభవార్తను అందించింది. వీరి వేతనాలను 50 శాతం నుంచి 300 శాతం వరకు పెంచే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వేతన పెంపు జనవరి 1, 2007 నుంచి అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

216 ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 1,20,000 మంది అసంఘటిత పర్యవేక్షక సిబ్బంది, 2,58,000 మంది బోర్డు స్థాయి అధికారులకు ఈ వేతన పెంపును వర్తింపజేస్తారు. లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం పెంపుతోపాటు, కరువుభత్యాన్ని కూడా అందజేయనున్నారు. ఇదిలా ఉంటే బలహీనంగా ఉన్న, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతన పెంపు 10 నుంచి 20 శాతం వరకు ఉంటుంది.

వేతన సవరణలను ఇంటి అద్దె వంటి ఇతర భత్యాలకు కూడా వర్తింపజేస్తారు. వీటికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా జోడిస్తారని ప్రధాని కార్యాలయ సహాయమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు. కొత్త వేతన సవరణలు జనవరి 1, 2007 నుంచి అమల్లోకి వస్తాయని, భత్యాలకు సంబంధించిన సవరణల అమలు మాత్రం ఆయా పీఎస్‌యూల సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ఎ ప్లస్, ఎ, బి, సి, డి అనే ఐదు కేటగిరీలుగా పీఎస్‌యూలను విభజించాలని ఈ ఏడాది మేలో రావు కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం పక్కనబెట్టింది. దీనికి బదులుగా కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసిన నాలుగు కేటగిరీల (ఎ,బి,సి,డి) ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకుందని చౌహాన్ తెలిపారు. తాజా వేతన పెంపుతో ఎ కేటగిరీ పీఎస్‌యూ ఛైర్మన్‌ హోదాలో ఉండే వ్యక్తి వేతనం రూ.80 వేల నుంచి రూ.1,25,000కు పెరుగుతుంది. ఇంతకుముందు వరకు వీరి వేతనం రూ.18,500 నుంచి రూ.23,900 వరకు మాత్రమే ఉండేది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం
చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు
సుధాకర్‌కు నకలీ ఐడీ ఇచ్చిన పురోహిత్: ఏటీఎస్
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు
1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...