|
| డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 15:07 IST ) | |
సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన "డిలైట్" సరుకు రవాణా నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని భారత జాతీయ నావికుల సంఘం (ఎన్‌యూఎస్ఐ) ప్రతినిధి సునీల్ నాయర్ వెల్లడించారు.
ఈ నౌకలో ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్నారు. హాంకాంగ్‌లో రిజస్టర్ చేయబడిన ఉన్న ఈ కార్గో నౌకను మంగళవారం రాత్రి ఆడెన్ గల్ఫ్‌లో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. హైజాక్ అనంతరం పైరేట్లు లంచం కూడా డిమాండ్ చేశారని నాయర్ చెప్పారు.
అయితే వారు ఎంత మొత్తం లంచం డిమాండ్ చేసింది వెల్లడికాలేదన్నారు. ఈ నౌకలో ఏడుగురు భారతీయ సిబ్బందితోపాటు, మరో 18 మంది సిబ్బంది కూడా ఉన్నారు. వారు పాకిస్థాన్, ఇరాన్, ఫిలిప్పీన్స్, గయానా దేశాలకు చెందినవారిగా గుర్తించారు.
హాంకాంగ్‌లో రిజిస్టర్ చేసిన ఈ నౌకను ఇరాన్ షిప్పింగ్ లైన్స్ అనే సంస్థ నడుపుతోంది. ఈ నౌకలో 26 వేల టన్నుల గోధుమ ఉంది. ఇరాన్ తీరప్రాంత నగరం బాందర్ అబ్బాస్‌కు వెళుతున్న డిలైట్ నౌకను పైరేట్లు హైజాక్ చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|