|
| చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు |
| కోర్బా (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 13:50 IST ) | |
చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అజిత్ జోగి వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకొని మర్వాహీ ప్రాంతంల ఈ దాడి జరిగింది. చత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ రోజు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో బిలాస్‌పూర్ జిల్లాలోని మర్వాహీ నియోజకవర్గం నుంచే అజిత్ జోగి పోటీ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొంత మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ జోగి, ఆయన అనుచరులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడి నుంచి అజిత్ జోగి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని రాష్ట్ర డీజీపీ తెలిపారు.
దాడికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారని, ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టపరిచినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో మహసాముంద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్ జోగి ఈసారి మర్వాహి (ఎస్టీ) సీటు కోసం పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉంటే చత్తీస్‌గఢ్ తుది దశ అసెంబ్లీ ఎన్నికల్లో మరో సంచలనం నమోదయింది. కర్బా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి గురువారం 56 మంది ఎన్నికల అధికారులను సస్పెండ్ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎన్నికల ప్రధాన అధికారి అశోక్ అగర్వాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు 51 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి.
అంతకుముందు గురువారం ఉదయం 8 గంటలకు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తుది దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎనిమిది జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఉదయం 8 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ దశ ఎన్నికల్లో 687 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
రెండో దశ ఎన్నికల్లో జరుగుతున్న నియోజకవర్గాల్లో 88,14,228 మంది ఓటర్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన భార్య రేణు జోగి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు దేవసాయి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ధనేంద్ర సాహు, డిప్యూటీ స్పీకర్ బద్రీధర్ దివాన్, హోం మంత్రి రామ విచార్ నేతమ్ తదితర కీలక రాజకీయ నేతలు రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తాజాగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఆరింటిని షెడ్యూల్ కులాలు, 15 స్థానాలను షెడ్యూల్ తెగలకు కేటాయించగా, 30 సాధారణ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాల్లో ఈ ఎన్నికల కోసం 12,073 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 2608 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా, 355 బూత్‌లను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా ప్రకటించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు 235 మంది స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|