యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సుధాకర్‌కు నకలీ ఐడీ ఇచ్చిన పురోహిత్: ఏటీఎస్
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 13:09 IST )
మాలేగావ్ బాంబు పేలుడు కేసులో అరెస్టు అయిన లెప్టినెంట్ కల్నల్ ఎస్పీ పురోహిత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా భావిస్తున్న సుధాకర్ చతుర్వేదికి నకిలీ ఐడీ కార్డు అందజేసినట్లు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) బుధవారం వెల్లడించింది. పూణే సమీపంలోని ఆర్మీ ఆయుధాగార కేంద్రంలోకి ప్రవేశించేందుకు వీలుగా సుధాకర్‌కు పురోహిత్ ఈ నకిలీ ఐడీని ఇచ్చాడని ఏటీఎస్ పేర్కొంది.

ఆర్మీకి చెందిన దేవ్లాలీ క్యాంప్‌లోకి ప్రవేశించేందుకు ఈ ఐడీ కార్డు తాత్కాలిక పాస్‌లాగా ఉపయోగపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన చతుర్వేదిని ముంబయి పోలీసులు నవంబరు 4న అరెస్టు చేశారు. నాసిక్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.

అతని వద్ద నుంచి నకిలీ ఆర్మీ ఐడీ కార్డుతోపాటు, ప్యాక్టరీలో తయారు చేసిన రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రివాల్వర్‌ను సుధాకర్ చతుర్వేదికి పురోహిత్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అభినవ్ భారత్ 2006లో తన కార్యకర్తల కోసం మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస శిబిరంలోనూ చతుర్వేతి పాల్గొన్నాడని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు
1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్
భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం
కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...