యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాయ్‌‍పూర్ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 11:11 IST )
చత్తీస్‌‍గఢ్ రాష్ట్రంలో గురువారం తుది దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఉదయం 8 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశ ఎన్నికల్లో 687 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

రెండో దశ ఎన్నికల్లో 88,14,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన భార్య రేణు జోగి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు దేవసాయి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ధనేంద్ర సాహు, డిప్యూటీ స్పీకర్ బద్రీధర్ దివాన్, హోం మంత్రి రామ విచార్ నేతమ్ తదితర కీలక రాజకీయ నేతలు రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

తాజాగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఆరింటిని షెడ్యూల్ కులాలు, 15 స్థానాలను షెడ్యూల్ తెగలకు కేటాయించబడగా, 30 సాధారణ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాల్లో ఈ ఎన్నికల కోసం 12,073 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 2608 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా, 355 బూత్‌లను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా ప్రకటించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు 235 మంది స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు
1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్
భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం
కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...